Thursday, November 21, 2024

10వేల మంది విద్యార్థుల‌తో ముట్ట‌డిస్తాం : జ‌గ్గారెడ్డి వార్నింగ్

ఇంట‌ర్ విద్యార్థుల ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌పై టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సీఎం కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… 10 వేల మంది విద్యార్థుల‌తో ఇంట‌ర్ బోర్డు కార్యాల‌యాన్ని ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రించారు. 2 లక్షల 36 వేల మంది ఇంట‌ర్ విద్యార్ధులు ఫెయిల్ అయ్యారని.. లక్ష పైబడి విద్యార్దులు ప్రభుత్వ కాలేజీ విద్యార్థులేన‌ని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్దం కావడం లేదని, ఆత్మహత్య లు జరుగుతుంటే పట్టించుకోవడం లేదని మండిప‌డ్డారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా విద్యార్థుల ఆత్మహత్యలు వద్దని చెప్పే పరిస్థితి కూడా లేదన్నారు. మూడు గంటలు దీక్ష చేశాం.. కానీ ప్రభుత్వం నుండి స్పందన రాలేదని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ను అపాయింట్ మెంట్ కోరాన‌ని, కానీ రిప్లై లేదని మండి ప‌డ్డారు. అందువ‌ల్ల ప్ర‌భుత్వం సానుకూల ప్ర‌క‌ట‌న రాకుండా మంగళవారం ఇంటర్ బోర్డు ముట్టడి కార్య‌క్ర‌మాన్ని చేప‌డ‌తామ‌ని జ‌గ్గారెడ్డి స్ప‌ష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement