శంకర్ పల్లి..ప్రభన్యూస్ : మండల పరిధిలో జాతీయ పతాకాలకు దారుణ అవమానం జరుగుతోంది. ఫ్లాగ్ కోడ్ ను అందరూ మర్చిపోయారు.జాతీయ పతాకాలకు 75 వసంతాల సందర్భంగా ప్రభుత్వ సూచనల మేరకు ఎగర వేసుకున్నాం.. కానీ జాతీయ పతాకం.. దాని విశిష్టతలను పూర్తిస్థాయిలో మర్చిపోవడం బాధాకరం. ఈ విషయంలో మండల పరిధిలో చినిగిపోయిన జాతీయ పతాకాలు రెపరెపలాడుతూ కోకొల్లలుగా కనబడుతున్నాయి..వాటిని గమనించే ఓపిక అధికారులకు లేదనిపిస్తోంది..అంతేకాకుండా జాతీయపతాకం ..దాని విలువపై అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు కూడా వాటిని పట్టించుకోవడం లేదు.. జాతీయ పతాకాన్ని గౌరవంతో చూడవలసిన బాధ్యత మనందరిపై ఉంది.. గ్రామాలలో మున్సిపాలిటీ పరిధిలో చిరిగిపోయి ..శల్యమై పోయిన జాతీయ పతాకాలను తొలగించి వాటి విలువలు కాపాడాలని పలువురు కోరుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి జాతీయ పతాకాన్ని గౌరవించే విధంగా నడుచుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement