Thursday, January 16, 2025

Nalgonda | హాస్పిట‌ల్ లో క‌లెక్ట‌ర్ ఆకస్మిక త‌నిఖీ… విధులకు హాజరుకాని సిబ్బంది తొలగింపు


న‌ల్గొండ : నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి గుర్రంపోడు మండలం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలానే ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. డాక్టర్లు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఇక కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా పలువురు విధులకు హాజరుకాలేదు.

సిబ్బంది మొత్తం ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజర‌య్యారు. దాంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఫార్మాసిస్ట్, ల్యాబ్ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్లు స‌కాలంలో విధుల‌కు హాజ‌రుకాక‌పోవ‌డం గుర్తించారు.. దీంతో క‌లెక్ట‌ర్ వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ప్రతి ఉద్యోగిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నప్పటికీ.. ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని గాలికి వదిలేసి సిబ్బంది గైర్హాజరు కావడం బాధాకరమని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో ఎక్కడ జరిగినా ఉద్యోగాల నుంచి తొలగించడం లేదా విధుల నుండి సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కలెక్టర్ ఇలా త్రిపాఠి పని తీరుపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement