విధులకు హాజరయ్యేందుకు హనుమకొండ నుంచి ములుగుకు వెళ్తున్న ములుగు డీపీఆర్వో ప్రేమలతకు రోడ్డుప్రమాదంలో గాయాలయ్యాయి. ములుగు జిల్లా కేంద్రం పరిధిలో ప్రేమ్‌నగర్ వద్ద వడ్లలోడు ట్రాక్టర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడంతో వెనుక వస్తున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈసంఘటలో డీపీఆర్‌వో ప్రేమలత ఎడమ చేయి విరిగింది. ములుగు ఏరియా వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం ఆమెను వరంగల్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement