తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో కాలు జారి పడటంతో గాయమైనట్లు సమాచారం. బాత్రూంలో జారి పడటంతో కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన కేసీఆర్ను కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం అర్థరాత్రి రాత్రి బాత్రూంలో జారి కింద పడడంతో సీఎం కేసీఆర్ కు గాయాలు అయినట్లు సమచారం . అర్ధరాత్రి రెండున్నర గంటలకు ఈ ఘటన జరిగింది.