Friday, November 22, 2024

ఉస్మానియా హాస్పిట‌ల్‌లో ఇంజక్షన్లు మాయం.. సిబ్బంది ఇండ్ల‌ల్లో వెలుగులోకి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉస్మానియా ఆసుపత్రిలో ఇంజక్షన్లను సిబ్బంది చోరీ చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇంజక్షన్‌ స్టాకు రికార్డుల్లో తేడాలు ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ఫార్మసీ స్టోర్‌లో పనిచేసే సిబ్బంది ఇంట్లో ఇంజెక్షన్స్‌ వయల్స్‌ ను వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఫార్మాసిస్టును ఆసుపత్రి కమిటీ అధికారులు పోలీసుల సాయంతో విచారిస్తున్నారు. హార్ట్‌ సర్జరీ, పెరాలసిస్‌ తదితర వ్యాధులను నయం చేసేందుకు ఇచ్చే ఖరీదైన ఇంజక్షన్లను సిబ్బంది మాయం చేశారు.

అయితే ఈ వ్యవహారం వెనక ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రికి వచ్చిన ఇంజక్షన్లు, వినియోగించిన వాటి వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో స్టోర్‌ సిబ్బంది నమోదు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ స్టోర్‌లో ఉండాల్సిన ఇంజక్షన్‌ వయళ్లు… సిబ్బంది ఇంట్లో లభించాయంటే ఆసుపత్రిలోని కీలక విభాగాల్లో పనిచేస్తున్న వైద్యుల హస్తం ఇందులో ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement