Friday, November 22, 2024

Breaking: ప్రారంభ‌మైన ప‌ది ప‌రీక్ష‌లు.. స‌జావుగా జ‌రిగేందుకు అన్ని ఏర్పాట్లు

సోమవారం ఉదయం రాష్ట్రంలోని 2,861 కేంద్రాల్లో SSC పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 140 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని, కేంద్రాల వద్ద నిఘా కెమెరాలను కూడా ఏర్పాటు చేశామన్నారు విద్యాశాఖ అధికారులు. కాగా, ఇవ్వాల ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్‌తో పరీక్ష షెడ్యూల్ ప్రారంభమైంది.

అయితే.. ఆల‌స్యం కాకుండా ఉండేందుకు ముందే విద్యార్థులు ప‌రీక్షా సెంట‌ర్ల‌కు చేరుకున్నారు. వారితో పాటు వారి త‌ల్లిదండ్రులు కూడా రావ‌డంతో ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప‌రీక్ష సెంట‌ర్‌లో పంపేట‌ప్పుడు బాగా రాయాల‌ని, టెన్ష‌న్ ప‌డొద్ద‌ని చెబుతూ బుజ్జ‌గించ‌డం క‌నిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement