Monday, November 18, 2024

లాక్ డౌన్‌ లోనూ ఆగ‌ని ప‌రిశ్ర‌మ‌…

ఉపాధికి భరోసా
లాక్ డౌన్‌ లోనూ రాష్ట్రంలో నిరాటంకంగా తయారీ
ఎప్పటిలాగే ఎగుమతులు
వలస కార్మికులకు ఉపశమనం
రాష్ట్ర జీఎస్డీపీకి ఊతం
ప్రభుత్వ నిర్ణయంపై పరిశ్రమ వర్గాల హర్షం

హైదరాబాద్‌, : సెకండ్‌వేవ్‌లో కోవిడ్‌ వ్యాప్తి నిరోధానికి రాష్ట్రంలో విధిం చిన లాక్‌డౌన్‌ నుంచి పరిశ్రమలకు మినహా యింపునివ్వడంతో కార్మికులు ఊపిరి పీల్చు కున్నారు. తమ ఉపాధిని కూడా దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నం దుకు వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కరోనా తొలివేవ్‌లో అమలు చేసిన లాక్‌డౌన్‌లో కొన్ని రంగాల పరిశ్రమలకు మాత్రమే మినహాయింపునివ్వడంతో చాలా వరకు పరిశ్రమలు, ముఖ్యంగా చిన్న మధ్య తరహా కార్ఖానాలు
మూతపడి వేల మంది కార్మికులు పని లేక రోడ్డున పడ్డారు. వలస కార్మికులైతే ఏకంగా తమ సొంతూ ళ్లకు బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచు కుని ఈ లాక్‌డౌన్‌లో అవసరమైన మేరకు పరిమిత సిబ్బందితో కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ అన్ని రకాల పరిశ్రమలు నడుపు కోవచ్చని అనుమ తినిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కార్మికుల దృక్కోణంలోనే కాకుండా లాక్‌డౌన్‌ అమలు చేసినప్పటికీ జీఎస్డీపీ పడిపోయి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోకుండా పరిశ్రమల కార్యకలాపాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర జీఎస్డీపీలో తయారీ రంగం వాటా 20 శాతం దాకా ఉండడంతో లాక్‌డౌన్‌ సమయంలో ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి పరిశ్రమలు కీలకంగా మారాయి. కోవిడ్‌ నిరోధానికిగాను హైదరాబాద్‌లోని మాల్‌లు, హోటళ్లు, థియేటర్లు లాంటి సేవా రంగం పరిధిలోకి వచ్చేవన్నీ మూతపడడంతో తయారీ రంగానికి అనుమతిస్తే కొంత వరకైనా ఉపశమనం కలుగుతుందని ప్రభుత్వం భావించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్నిఅంతర్జా తీయ మార్కెట్లు ప్రస్తుతం ఓపెన్‌గా ఉండడంతో ఎగుమతులకు ఎలాంటి ఇబ్బ ంది తలెత్తకూడదన్నది కూడా పరిశ్రమలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు నివ్వడానికి మరో కారణంగా వారు పేర్కొంటున్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న కేవలం రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే 35 వేల దాకా ఉన్న చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. వీటిలోనే సుమారు 3 లక్షల మంది దాకా ఉపాధి పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి పరిశ్రమల్లోని చాలా మంది కార్మికులకు ఇటీవల ప్రారంభమైన సెకండ్‌వేవ్‌లో కరోనా సోకి అనార్యగ్యం పాలయ్యారని, వీరంతా సిక్‌ లీవ్‌ లేదా పెయిడ్‌ లీవ్‌లలో వెళుతున్నారని అక్కడి ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న పలువురు కార్మికులు చెబుతున్నారు. కరోనా సోకడం, మరోపక్క ప్రభుత్వం లాక్‌డౌన్‌ పెట్టి అన్నీ మూసేస్తుందన్న భయంలో హైదరాబాద్‌ చుట్టూ ఉన్న చిన్న తరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న 60 శాతం మంది దాకా వలస కార్మికులు తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లే పరిస్థితులు రెండు రోజుల క్రితం వరకు నెలకొన్నాయని వారు తెలిపారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నుంచి ప్రభు త్వం పరిశ్రమలకు మినహాయింపునివ్వడ ంతో వలస కార్మికులంతా ప్రయాణాలు రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. నాచారం, మల్లాపూర్‌, ఉప్పల్‌, బాలానగర్‌లలో ఉన్న పారిశ్రామిక వాడల్లోనూ వేల మంది వలస కార్మికులు ప్రభుత్వ నిర్ణయంతో సొంతూళ్లకు వెళ్లే బాధ తప్పిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ శివార్లలోని షాపూర్‌ నగర్‌, షామీర్‌ పేట, మల్లాపూర్‌లలోని పారిశ్రామిక వాడల్లో ఉన్న చిన్న,మధ్య తరహా ఫార్మా పరిశ్రమల్లో ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొన్నట్లు ఇప్పటికే చాలా వరకు తక్కువ సిబ్బందితో పనిచేసు ్తన్నాయని పరిశ్రమల యజమాన్యాలు చెబుతున్నాయి. సిబ్బందిలో కొంత మందికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతిలో పనిచేయించుకుందామనుకున్న మా పరిశ్రమల్లో తయారీకి ఎక్కువ మంది మ్యాన్‌ పవర్‌ పరిశ్రమలోనే ఉండి పనిచేయాల్సి ఉంటుందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
500 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తుంటే కోవిడ్‌ క్యాంపు…
లాక్‌డౌన్‌ కాలంలో 500 మంది కంటే ఎక్కువ మందితో పనిచేయాల్సి వచ్చే పరిశ్రమలు వాటి ఆవరణలోనే అన్ని వసతులతో కూడిన కోవిడ్‌ ఐసోలేషన్‌ క్యాంపును ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొంది. దీంతో పరిశ్రమ స్థాయిని బట్టి ప్రత్యేక కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ భారీ, మధ్యతరహా, చిన్న పరిశ్రమలకు అనుమతివ్వడం పట్ల పరిశ్రమల అసోషియేషన్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక పరిశ్రమల్లో సాధారణ కార్యకలాపాల నిర్వహణకే కాకు ండా పరిశ్రమల సామర్ధ్యాల విస్తరణకు జరిగే నిర్మాణాలకు కూడా అనుమతిస్తూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలివ్వడాన్ని అసోసియేషన్‌లు స్వాగతిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement