Saturday, November 23, 2024

Hot Comments – రేవంత్ రెడ్డిపై ఇంద్ర‌సేనారెడ్డి గ‌రం గ‌రం …

హైద‌రాబాద్ – త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన నల్లు ఇంద్రసేనారెడ్డి పిసిసి అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు పనితీరు ఏంటో మోడీకి తెలుసరి ఇంద్రసేనారెడ్డి ఫైర్ అయ్యారు. రెడ్లకు తానే ప్రతినిధినని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డినైన తనకు గవర్నర్ పదవి వచ్చిందనందుకు రేవంత్ రెడ్డి బాధ పడిపోతున్నారని మండిపడ్డారు. ఎంతసేపూ ఇతరులను ఇరకాటంలో పెట్టడమే రేవంత్ రెడ్డి పని అంటూ వ్యాఖ్యలు చేశారు.

సొసైటీని డివైడ్ చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రెడ్లకు తానే ప్రతినిధినని రేవంత్ ఓపెన్‌గా అనేకసార్లు చెప్పారన్నారని స్పష్టం చేశారు. మోడీ స్వయంగా ఫోన్ చేసి త్రిపుర గవర్నర్‌గా నియమిస్తున్నట్లు చెప్పారని.. తన సిన్సియారిటీ గురించి ఏపీ, తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. ఎవరు పనితీరు ఏంటో మోడీకి తెలుసన్నారు. ఎప్పుడు ఎవరకి ఏ బాధ్యతలు ఇవ్వాలో వారికి తెలుసని చెప్పుకొచ్చారు. గతంతో పోల్చితే మోడీ హాయాంలో ఈశాన్య రాష్ట్రాలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయని నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement