జైనూర్, డిసెంబర్ 23 (ఆంధ్రప్రభ) : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జైనూర్, మార్లవాయి గ్రామాలను సోమవారం ఆసిఫాబాద్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి సందర్శించారు. మార్లవాయిలో నూతనంగా ఏర్పాటు చేసే డిజిటల్ గ్రంథాలయం, కార్యదర్శుల శిక్షణ సెంటర్ ఏర్పాట్ల గురించి పరిశీలించారు. మార్లవాయిలో జనవరిలో జరిగే ఆదివాసుల ఆత్మ బంధువులు హేమంన్ ఢర్ప్ దంపతుల వర్ధంతికి హాజరుకావాలని, సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డార్క్ యూత్ నాయకులు అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు.
అనంతరం జైనూరులో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించి సర్వే పారదర్శకంగా చేయాలని ఆయన సూచించారు. తదితర విషయాలపై అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్లవాయి తాజా మాజీ సర్పంచ్ కనక ప్రతిభా వెంకటేశ్వరరావు, ఆసిఫాబాద్ డిఎల్పిఓ ఉమర్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, ఎంపీ ఓ మోహన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, జైనూర్ ఈవో కురుశంగా ఆనందరావు, మార్ల వాయి కార్యదర్శి మనోజ్ కుమార్, ఢర్ప్ యూత్ నాయకులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.