Friday, November 22, 2024

Revanth Reddy: బంగ్లాదేశ్ కి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్సే!

బంగ్లాదేశ్ కి విముక్తి కల్పించిన పార్టీ కాంగ్రెస్సే అనని టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పాకిస్థాన్ మీద ఇందిరా గాంధీ యుద్దం ప్రకటించి బంగ్లాదేశ్ ప్రజలకి విముక్తి కల్పించారని చెప్పారు. మంగళవారం గాంధీభవన్ లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, (ఇండో పాక్ 1971) విజయోత్సవ దినోత్సవం 50 వ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా రేవంత్ మాట్లాడారు. బంగ్లాదేశ్ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్న సంధర్భంగా ఆ దేశ యువతకి స్ఫూర్తిని ఇవ్వడానికి ఈ కార్యాక్రమం ఎర్పాటు చేసిట్లు చెప్పారు. దేశం వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరగుతున్నాయని వెల్లడించారు. బంగ్లాదేశ్ ఏర్పాటులో ఇందిర కీలక పాత్ర పోషించారని రేవంత్ అన్నారు. ఇందిరా గాంధీ లాంటి సాహసమైన నాయకుల గురించి నేటి యువతకు తెలియాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆనాటి లిబరేషన్ వార్ లో ప్రధాన పాత్ర పోసించింది ఇందిరా గాంధీ అని అన్నారు. ప్రస్తుత పాలకుల తమకంటే గొప్ప నాయకులు లేరని చెపుతున్నారని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భారత దేశాన్ని ఇందిరా గాంధీని విడదీసి చూడలేమన్న భట్టి.. అటల్ బీహార్ వాజ్పాయ్ ఆనాడు ఇందిరా గాంధీని దుర్గా దేవిగా అభివర్ణించారని గుర్తు చేశారు. బంగ్లాదేశ్ కి స్వాతంత్రం ఇచ్చింది భారత దేశమేనని చెప్పారు.

 కాగా, ఈ కార్యక్రమంలో ఏఐసీసీ బాంగ్లాదేశ్ ఉత్సవ కమిటీ కన్వీనర్ దావర్, మాజీ ఆర్మీ అధికారి ఏఆర్కే రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement