ఆర్థిక అసమానతలు పెరగడం వల్ల సమాజానికి మంచిది కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హోటల్ తాజ్ కృష్ణలో ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడ రచన చేసిన ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదలిరండి అనే పుస్తకాన్ని మాజీ కేంద్ర మంత్రి ఎం.ఎం పల్లంరాజు, మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కి గౌడ్ తో కలిసి భట్టి ఆవిష్కరించారు.
అనంతరం భట్టి మాట్లాడుతూ టెలి కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికిన ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా తనకు స్ఫూర్తి దాయకులన్నారు. ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా రచన చేసిన ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదలిరండి అనే పుస్తకం దేశంతో పాటు సమాజాన్ని మార్చి వేస్తుందన్న నమ్మకం ఉన్నదని తెలిపారు. ఆర్థిక అసమానతలు పెరగడం వల్ల సమాజానికి మంచిది కాదని ఇంక్లీజీవ్ గ్రోత్ బయట ఉన్న ప్రజలను ఇంక్లీజీవ్ గ్రోత్ లోకి తీసుకురావాలని ఈ పుస్తకంలో చాలా విశ్లేషణాత్మకంగా చెప్పారు. సమాజ హితం కోసం వారు చేస్తున్న రచనలు చాలా స్ఫూర్తిదాయకం చైతన్యవంత మైనవన్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, మాజీ డిజిపి సాంబశివరావు, క్వార్డ్ వైర్లెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సి.ఎస్.రావు, ఈ పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేసిన పూలదాసు నరసింహారావు, సంపాదకులు డాక్టర్ డి. చంద్రశేఖర్ రెడ్డి గార్లు తదితరులు పాల్గొన్నారు.