Saturday, November 23, 2024

ప్ర‌భుత్వ‌ బ‌డుల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గతంతో పోలిస్తే క్రమంగా పెరుగుతోంది. మూడేళ్ల క్రితంతో పోలిస్తే ఈ విద్యాసంవత్సరంలో కొంతమేరకు పెరిగింది. 2018లో 56.4 శాతం విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా, 2021లో ఆ సంఖ్య 60 శాతానికి చేరింది.

ఈ ఏడాది 2.5లక్షల విద్యార్థులు తెలంగాణలోని సర్కారు బడుల్లో అడ్మిషన్లు పొందారు. గతంలో ఎన్నడూ లేనంతగా వీరంతా ప్రభుత్వబడుల బాటపట్టడంతో అడ్మిషన్లు గణనీయంగా పెరిగినట్లు గ్రామీణ పాఠశాలలపై అసర్‌ (అన్వల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ రూరల్‌)-2021 తన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement