వికారాబాద్, డిసెంబర్ 17 (ఆంధ్రప్రభ): వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనవరి నుండి అక్టోబర్ వరకు ప్రసవాల సంఖ్య పెరిగిందని వికారాబాద్ జిల్లా వైద్యాధికారి డా.వెంకటరవణ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు 5109 కాగా, సిజేరియన్ ప్రసవాలు 3074 జరిగినట్టు తెలిపారు.
ప్రైవేట్ ఆసుపత్రిలో 594 సాధారణ ప్రసవాలు కాగా, సిజేరియన్ ప్రసవాలు 2574 జరిగినట్టు తెలిపారు. మొత్తం ప్రసవాలు 11,351 జరిగినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్వో జీవరాజ్, మీడియా అధికారి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -