హైదరాబాద్, ఆంధ్రప్రభ: పెంచిన బస్‌పాస్ ఛార్జీలు, బస్ ఛార్జీలు తగ్గించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బస్ ఛార్జీలు పెంచడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ వ్యతిరేకించింది. అనేక ఇబ్బందుల రిత్యా హైదరాబాద్ నగరంలో విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపింది. ఇప్పటికే ఒక పక్క కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులు పెంచాయని, సుదూర ప్రాంతాల నుండి ఎన్నో కష్టాలకోర్చి నగరానికి వస్తున్నవారికి పెంచిన ఛార్జీలు మరింత భారం కానున్నాయని పేర్కొంది. విద్యార్థుల బస్‌పాస్ ధర పెంపు నిర్ణయం సరికాదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. బస్ పాస్ ధర 50-75 శాతం పెంచడం పేద విద్యార్థులకు ప్రభావం చూపెడుతోందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.