Sunday, November 17, 2024

ఉపాధి కూలీల వేతనం పెంపు.. జీవో విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోజువారీ వేతనాన్ని రూ.245 నుంచి రూ.257కు పెంచింది. పెంచిన ఉపాధి హామీ వేతనాలు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు శుక్రవారం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో నెంబర్‌ 119ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనుులు కొనసాగుతున్నాయి.

పలు గ్రామాల్లో కొనసాగుతున్న పనులను అధికారులు పరిశీలిస్తున్నారు. కూలీల హాజరు, పనుల వివరాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం పూటే పనులు చేయిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement