హైదరాబాద్, ఆంధ్రప్రభ: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి అప్రమత్తం చేసింది. కరోనా టెస్టులు పెంచాలని లేఖ రాసింది. ఇన్ఫెక్షన్లను తగ్గించడమే లక్ష్యంగా టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్ లేఖరాశారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో టెస్టింగ్‌లదే కీలకపాత్ర అన్నారు. విస్తృతస్థాయిలో టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, నిబంధనలు పాటించడం అనే ఐదంచెల వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరారు. కోవిడ్ కట్టడికి ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.
రాష్ట్రంలో 122 కరోనా కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు వందకుపైగా కరోనా కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. గురువారం 122 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.