సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నవ్య డెవలపర్స్ పై బుధవారం మధ్యాహ్నం నుండి ఐటి సోదాలు చేపట్టింది. పఠాన్ చేరు నియోజకవర్గంలోని ఇంద్రేశం, బీరం గూడ ప్రాంతాల్లోని నవ్య కార్యాలయాల్లో ఐటి ఏకకాలంలో దాడులు నిర్వహిస్తుంది. ప్రధానంగా నవ్య క్రయ, విక్రయాలలో తేడాలు, మార్కెట్ రేటు కంటే తక్కువగా దస్తావేజులు చేయించి సొమ్మును బ్లాక్ మార్కెట్ కు తరలించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేథ్యంలోనే ఐటి దాడులు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటి వరకు ఐటి అధికారులు మీడియాకు ఎలాంటి సమాచారం అందించకపోవడం విశేషం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital