హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆదాయపు పన్ను పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామీళ్ల రాజేందర్ అన్నారు. శనివారం అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య(ఏ ఐ జీ యి ఎఫ్ ) రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలుటూరిజం ప్లాజా ప్రాంగణంలో జరగనున్నాయి. ఈ సమావేశా లకు దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల ప్రతినిధులు, 104 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ రెండు రోజుల సమావేశాలను టీఎన్జివో కేంద్ర సంఘం తరపున అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ ఆతిథ్యంతో జరుగుతున్నాయి.
సమావేశాలలో ప్రధానంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్‌లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చించారు. ప్రధానంగా ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, ఆదాయ పన్ను పరిమితిని రూ. 10 లక్షలకు పెంపు లాంటి అనేక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపారు. అంతేకాకుండా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఎజెండాగా తీసుకొని కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరితే దాన్ని రాష్ట్రాలపై రుద్దడం సమంజసం కాదని, కేంద్ర ప్రభుత్వమే సిపిఎస్ రద్దు కోసం చర్యలు తీసుకోవాలని, తదితర సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెెచ్చేందుకు భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.
టీఎన్జివో కేంద్ర సంఘం అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్‌లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం అన్ని రాష్ట్రాలకు భిన్నంగా ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటుందని, 30శాతంఫిట్మెంట్‌తో పిఆర్సి ఇవ్వడం, పదవి పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచడంలాంటి అనేక ఉద్యోగ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నదన్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily