Friday, November 22, 2024

Railway | ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. సికింద్రాబాద్, కాకినాడ మధ్య స్పెషల్​ ట్రెయిన్స్​

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్‌ – నుంచి కాకినాడ టౌన్‌, కాకినాడ టౌన్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు ప్రత్యేక రైళ్లు ఆగస్టు 31 నుంచి, సెప్టెంబర్ 1వ తేదీ మధ్య రైళ్లు నడుపనున్నట్లు పేర్కొంది. ఈ నెల 31న రైలునంబర్‌ 07441 సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రాత్రి 9.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు కాకినాడ చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.

సెప్టెంబర్‌ ఒకటిన రైలు నంబర్‌ 07442 కాకినాడ రైల్వేస్టేషన్‌ నుంచి రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనున్నది. ఆయా రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్‌, విజయవాడ జంక్షన్‌, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట తదితర స్టేషన్లలో ఆగుతుందని పేర్కొంది. ఆయా రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement