హైదరాబాద్,ఆంధ్రప్రభ: బీఈడీ మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 14,267 కన్వీనర్ కోటా సీట్లు ఉండగా, వాటిలో 9,417 సీట్లను మొదటి విడతలో అభ్యర్థులకు కేటాయించారు. సీట్ల కోసం 13,405 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇంకా 4,850 సీట్లు మిగిలాయి. వీటిని రెండో విడతలో భర్తీ చేయనున్నారు. ఆయా కాలేజీల్లో సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీ నుంచి 13వ తేదీలోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. తరగతులు ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్నట్లు కన్వీనర్ ప్రొ.పి.రమేష్ బాబు పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement