Thursday, November 21, 2024

శ్రీరామా సర్క్యూట్‌లో భద్రాచలానికి చోటు

శ్రీ‌రామ సర్క్యూట్‌లో భ‌ద్రాచ‌లానికి చోటు ల‌భించ‌లేద‌న్న విమ‌ర్శ‌ల త‌రుణంలో ఆ విమ‌ర్శ‌ల‌కు చెకు పెడుతు రైల్వేశాఖ ప్రారంభించిన శ్రీరామాయణ్‌ యాత్ర ప్యాకేజీలో దక్షిణ అయోధ్య భద్రాచలానికి కూడా చోటు క‌ల్పించింది. ఈ నెల 7 నుంచి న్యూఢిల్లీ సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర.. శ్రీరాముడి జీవితంతో ముడిపడి ఉన్న దేశంలోని అన్ని ముఖ్యమైన ప్రదే శాలకు యాత్రికులను తీసుకెళ్తుంది.

ఈ సర్క్యూట్‌లో ప్రయా ణం అయోధ్య నుంచి మొదలై.. నందిగ్రామ్‌, సీతామర్హి (సీత జన్మస్థలం బీహార్‌), జనక్‌పూర్‌, వారణాసి, ప్రయాగ, చిత్రకూట్‌, నాసిక్‌, హంపీ మీదుగా రామేశ్వరం వరకు మొత్తంగా 7,500 కిలోమీటర్ల మేర రామాయణ్‌ యాత్ర కొనసాగుతుంది.
రామేశ్వరం నుంచి తిరుగు ప్రయాణంలో రైలు భద్రాచలంలో ఆగుతుంది. గోదావరి తీరంలో స్వయం వ్యక్తమైన రామచంద్రుడి ఆలయం, పర్ణశాల రామభక్తులకు ముఖ్యమైన తీర్థ క్షేత్రాలు. ఈ క్షేత్రాన్ని చూడకుండా రామాయణ పరిక్రమ పూర్తికాదు. అందుకే రామాయణ యాత్రలో ప్రత్యేక రైలు భద్రాచలం రోడ్‌ స్టేషన్‌లో ఆగి.. యాత్రికులను భద్రాచల రాముడి దర్శనం, గోదావరి నదీ పరీవాహకాన్ని చూపించి తిరిగి ఢిల్లీకి పయనమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement