ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, త్రాగు నీటి అవసరాలకు వరప్రదాయంగా మారిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా జూరాల ప్రాజెక్టు ఎగువన తెలంగాణ, కర్ణాటక పరిసర ప్రాంతాలలో వర్షాలు కురుస్తుండటంతో జూరాలకు వరద ప్రవాహం మొదలైంది. సోమవారం ఉదయానికి 3,806 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది.
ఈ సీజన్‌లో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదికి స్వల్పంగా వరద మొదలైంది. క్రమంగా వరద ప్రవాహం పెరగడంతో 3,806 క్యూసెక్కుల వరద నీరు జూరాల ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 315.840 మీటర్లు, 4.936 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
- Advertisement -