తెంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ భారత్ మిషన్‌లోని పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలవడం, కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు రావడం నిదర్శనం. దీనిప మంత్రి కెటిఆర్ హర్షం వక్తం చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ ఆఫీసులో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఏడున్నర సంవత్సరాలుగారాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది. వివిధ కార్యక్రమాలను అమలు చేస్తూ అభివృద్ధిలో ముందుకు పోతున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. పట్టణాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పట్టణాభివృద్ధిలో సమూలమైన మార్పులు తీసుకువచ్చారు. ఆదర్శవంతమైన పట్టణాలను రూపొందించేందుకు సీఎం కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా అమలు చేశారు. మున్సిపాలిటీల సంఖ్యను 68 నుంచి 142కు పెంచాం. మున్సిపాలిటీలకు నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నామన్నారు .