ఏమాత్రం పొగరాదు… శబ్దం వెలువడదు… విస్ఫోటనంతో భూకంపం వచ్చి అల్లల్లాడాల్సిందే! అయితే, అది బాంబు కాదు… రాజకీయ ఎత్తుగడ! ప్రత్యర్థులకు దిమ్మదిరగాల్సిందే… కోలుకునేలోపు జరిగిన అపార నష్టాన్ని కూడా అంచనా వేయలేని దుస్థితి వారిది! దాని వ్యూహ నిర్మాత మూడక్షరాల సంక్షిప్త నామ స్వరూపం కేసీఆర్! ఆయన మౌనం వహించాడంటేనే వణుకు మొదలవుతుంది… అది దీర్ఘకాలం సాగిందంటే తుపాను ముందు ప్రశాంతతే! ఎన్నికల వేళ… ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీలు నానా హంగామా చేస్తున్నాయి. చేరికల హడావుడికి తెరలేపాయి. చోటామోటా నేతలను చేర్చుకుని భూమి బద్దలైపోయినట్టు
బిల్డప్ ఇస్తున్నాయి…
హైదరాబాద్, ఆంధ్రప్రభ: కర్నాటక ఎన్నికల తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దల హంగామా ఎక్కువైంది. డిక్లరేషన్లు, గ్యారంటీలంటూ హోరెత్తి స్తోంది. ఏమాత్రం హడావుడి లేకుండానే మేని ఫెస్టోను ప్రకటించి ప్రకంపనలు సృష్టించిన కేసీఆర్ ఆ తర్వాత విస్తృత స్థాయిలో ప్రచారం మొదలు పెట్టారు. తెలంగాణ అమూలగ్రం క్షుణ్ణంగా తెలి సిన కేసీఆర్ ఏ ప్రాంతంలో ఏ నియోజకవర్గంలో ఏ ఊళ్లో ఏ ఇంట్లో ఏ సమస్య ఉందో ఎలా పరిష్కరిం చాలో అధ్యయనంతో తెలుసుకున్న అపార అను భవం ఆయనది! ఇందుకు తెలంగాణ కుటుంబ సర్వే డేటా ఆయనకు నేడు అర్జునుడి అంబుల పొదిగా మారింది. అది ఎప్పటికీ నిండుగానే ఉంటుంది… అన్నిరకాల శక్తివంతమైన అమ్ము లతో! గత ఎన్నికల్లో కూడా ఆయన వేసిన ఎత్తులకు బిత్తరపోయిన ప్రత్యర్థులు చిత్తయిపోయి మళ్లిd కోలుకోవడానికే అయిదేళ్లు పట్టింది!
ఆయన వెనుకడుగు వేసినట్టు కనిపించిందంటేనే పంజా పదునెక్కిందని అర్థం. ఇక ఆయన ప్రగతిభవన్‌లో ఉన్నా ఫామ్‌హౌస్‌లో ఉన్నా ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే శ్వాసగా గడుపుతారు. ఇందులో ఎత్తుగడలు, ప్రతివ్యూహాలు, ప్రణాళికలు కలగలిసి ఉంటాయి! దేశంలో ఆరితేరిన రాజకీయనేతలు, విశ్లేషకులకు సైతం ఆశ్చర్యం కలిగించేలా ఆయన రాజకీయ కదలికలు ఉంటాయి. ఇక నియోజక వర్గాల వారీగా ఆయన సమాచారాన్ని ఎప్పటి కప్పుడు వివిధ మార్గాల ద్వారా తెలుసుకుంటుం టారు. తన అనుభవంతో వాటిని సరిపోల్చుకుం టారు. ఏమాత్రం తేడా కనిపించినా వెంటనే రకర కాల ప్రణాళికలను వివిధ మార్గాల ద్వారా అమలు చేస్తుంటారు. అవేంటో తెలుసుకునేలోపే భారాసకు అనుకూలంగా, ప్రత్యర్థి కోలుకోలేని రీతలో పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోతుంటాయి. అంటే ప్రత్యర్థులు నిద్ర లేచే లోపే సర్జకల్ స్ట్రయిక్‌లు జరుగుతుంటాయి. అన్నిచోట్ల అన్ని రకాల వ్యూహ ప్రతి వ్యూహాలను ఏకకాలంలో అమలు చేయగల దిట్ట కాబట్టే ఆయన సవ్యచాచి!
రాజకీయ రంగంలో ఎన్నో పీహెచ్‌డీలు చేసిన కేసీఆర్‌కు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు! …అందుకే ఆయనకు చిన్న అవకాశం చిక్కినా పరమాణువును సైతం పెను విస్ఫోటనం చెందేలా చేయగల కాకలు తీరిన నేతలకే ఆయన గుగ్గురువు అని రాజకీయ పండితులే వ్యాఖ్యానిస్తుంటారు! తెలంగాణలో ఏ మూల ఏ సమస్య ఉందో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. పైగా… సమస్య పురుడు పోసుకోగానే దాని లోతుపాతులు అంచనా వేయగల సత్తా ఆయన సొంతం. వెంటనే అందుకు పరిష్కారాన్ని కూడా ఆయన రూపొందిస్తారు. దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తారు. నియంత్రించి అందరికీ ఆమోదయోగ్యంగా మార్చగల ట్రబుల్ షూటర్స్‌ను అమలు చేసేందుకు నియోగిస్తారు.
ప్రతి ఇంటికీ ఏయే పథకం అందిందీ, ఇంకా ఏమేమి చేయవచ్చు… ఎంతమంది అర్హత కలిగి ఉన్నారు… రేషన్ కార్డు నుంచి సీఎం సహాయ నిధి వరకూ ఏవిధమైన సహాయం చేయవచ్చో సమగ్రంగా, సవివరంగా ఆయన వద్ద కీలక సమాచారం విశ్లేషించి మరీ అందుబాటులో ఉంది. దీంతో ఎవరికి ఏమేమి పథకాలు ఇంకా అందించడానికి అవకాశం ఉందో అవన్నీ ఎలా ఆచరణలోకి తీసుకురావచ్చో కూడా ఆయన వద్ద ప్రణాళికలు ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, అన్ని నియోజక వర్గాలు, అన్ని కుటుంబాల్లో ఏయే సమస్యలు ఉన్నాయో ఆయన ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు.
దేవుడే అందరికీ మంచివాడు కాని ఈ రోజుల్లో తెలంగాణలోని సమగ్ర కుటుంబ సర్వే డేటా ద్వారా ఆయన ఇంటింటి సమస్యను తన సొంత సమస్యగా పరిగణిస్తారు. అందుకు సరైన పరిష్కారమార్గాన్ని పెద్దకొడుకులా ఆలోచిస్తారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక సమస్యలకు అనుగుణంగా భారాస పథకాలు అందేలా చూస్తారు. ఇంత ముందుచూపు కలిగిన నేత కనుకే ఆయనకు నిన్న, నేడు, రేపు కూడా నీరాజనాలు పట్టడానికి తెలంగాణ సమాజం సంసిద్ధంగా ఉంది.
భారాస అభ్యర్థులకు బీఫామ్‌లు ఇచ్చారు. ఎన్నికల ప్రచారం మొదలైంది. రెండు రోజుల క్రితం ఓ అభ్యర్థి ఫోన్ మోగింది. అవతలి వ్యక్తి సాక్షాత్తు కేసీఆర్! ఏమయ్యా… మీ ఊళ్లో ఫలానా వ్యక్తి ఇంట్లో ఈ సమస్య ఉంది ఏం చర్యలు తీసుకున్నావ్… అని అడిగారు. బిత్తరపోవడం ఆ అభ్యర్థి వంతు అయింది. వెంటనే తేరుకుని సర్… రేపే మాట్లాడతాను సర్ అన్నాడు. అలాకాదు… నువ్వే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లు… మీకు ఈ సమస్య ఉంది… సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చింది. మీతో స్వయంగా ఆయనే చెప్పమన్నారు… మళ్లి ఎన్నికలు ముగియగానే మీ సమస్యను ఈవిధంగా తీరుస్తానని వివరంగా చెప్పు. ఆయనకు ఎదురైన ఈ సమస్య తాత్కాలికమేనని చెప్పు… గద్దెనెక్కిన వెంటనే నువ్వు తీర్చాల్సిన మొదటి సమస్య ఇదే… ఈ విధంగా ఊరందరి ముందు ఆయనకు హామీ ఇవ్వు. అలాగే, ఇంకా ఆ ఊళ్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకో… అని కేసీఆర్ చెప్పడంతో ఆ అభ్యర్థికి నోట మాట రాలేదు! ఇలా ఉంటుంది కేసీఆర్ వద్ద సమాచారం!