రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ పికే రామయ్య కాలనీలో ఆన్లైన్ గేమ్ కు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బుల పంపకాల వ్యవహారంలో జరిగిన ఘర్షణ కాస్త కత్తులతో దాడి చేసేవరకు వచ్చింది. రామయ్యా కాలనీలోనీ ఇమ్రాన్ అనే యువకుడు ఏజెంట్ గా వ్యవహరిస్తూ కాలనీకి చెందిన కొందరు యువకులతో మొబైల్ ద్వారా ఆన్లైన్ గేమ్ నిర్వహిస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో సదరు కాలనీకి చెందిన మల్లేష్ తనకు రావాల్సిన నగదు గురించి ఇరువురి మధ్య సంభాషణ కాస్త కత్తీతో పోడిచే వరకు దారి తీసింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు 100 కు డయల్ చెయ్యడంతో సంఘటన స్థలాన్ని చేరుకున్న ఎన్టీపీసీ పోలీసులు యువకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అయితే ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఎన్టిపిసి పోలీస్ స్టేషన్లో ఇదివరకే కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ సంఘటనపై ఎన్ టి పి సి ఎస్ఐ జీవన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో కాలనీలోని తల్లిదండ్రులు ఇప్పటికైనా పోలీసు అధికారులు ఈ ఆన్లైన్ గేమ్ నుండి మా పిల్లలు దూరంగా ఉండేవిధంగా అవగాహన కార్యక్రమాలు తో పాటు నిర్వహిస్తున్న వారిపై కఠినంగా వ్యవరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.