వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి ప్రముఖ పర్యాటక కేంద్రమైన అనంతగిరికి వెళ్లే మార్గం ఆరు కిలోమీటర్ల దూరం పూర్తిగా గుంతల మయంగా మారింది. వాహనాలు వెళ్లేందుకు వీల్లేకుండా ఉంది. ఇటీవలి కాలంలో అనంతగిరి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి సాధించడంతో ప్రతి శని, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వాహనాల్లో ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఈ రోడ్డు పరిస్థితి చూసి ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఆర్అండ్ బీ అధికారులు కానీ అటు ఫారెస్ట్ అధికారులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ రోడ్డును బాగు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉన్నతాధికారులు ఆలోచించి ఇప్పుడిప్పుడే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి సాధిస్తున్న అనంతగిరి పర్యాటక కేంద్రానికి వెళ్లే మార్గాన్ని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement