హైదరాబాద్ – గణేశ్ నవరాత్రి ఉత్సవాల చివరి రోజున . వివిధ ప్రాంతాల్లో నేడు గణేశ్ నిమజ్జనం కొనసాగుతోంది. 11 రోజులుగా ప్రత్యేక పూజలందుకున్న గణనాథులను ఆయా ప్రాంతాల్లో భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తన ఇంట్లోనే గణేశుడి నిమజ్జనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
కాగా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా చాలా మంది మట్టివినాయకులను పూజిస్తున్న విషయం తెలిసిందే. ఇక పూజల అనంతరం ఆ వినాయకులను ఎంతో ఈజీగా ఇంట్లోనే నిమజ్జనం చేసేస్తున్నారు. ఓ కుండలో వినాయకుడిని ఉంచి నిండా నీళ్లు పోస్తారు. ఆ నీటికి మట్టి వినాయకుడు కరిగిపోతాడు. ఆ తర్వాత ఆ మట్టిని బైట పడేయకుండా ఓ మొక్కను పెంచుతారు. సీవీ ఆనంద్ కూడా ఇలా నిమజ్జనం చేసిన తర్వాత ఆ కుండలో మొక్క నాటినట్లు వెల్లడించారు.