Friday, November 22, 2024

Illness – సిపిఎం త‌మ్మినేని వీర‌భ‌ద్రంకి లంగ్ ఇన్ఫెక్షన్… మెరుగైన వైద్యం కోసం హైద‌రాబాద్ కు త‌ర‌లింపు

ఖమ్మం :సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర అస్వస్థ కు గురయ్యారు. ఒక మీటింగ్ లో పాల్గొన్న ఆయ‌న శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ్డారు.. ఆయ‌న‌కు గుండెపోటు అని భావించి వెంట‌నే ఆయ‌న‌ను ఖ‌మ్మ‌లోని హ‌స్ప‌ట‌ల్ కు త‌రలించారు. వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యులు ఆయ‌న‌కు గుండెపోటు లేద‌ని తేల్చారు.. లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని వైద్యులు తెలిపారు… ఆ త‌ర్వాత ఆయనను మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. ఆందోళన అవసరం లేదని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకుకోవాలని వైద్యులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement