Tuesday, November 26, 2024

TS: అక్రమంగా మట్టి రవాణా.. లారీలను అడ్డుకున్న గ్రామస్తులు

.. అధికారుల తీరుపై ఆగ్రహం
పెద్దపల్లి (ఆంధ్ర ప్రభ) : చెరువు మట్టి అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది. అడ్డుకోవాల్సిన అధికారులు మట్టి ఆక్రమణదారులు ఇచ్చే మామూళ్ల‌కు ఆశపడి చర్యలు మర్చిపోయారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్పల్లి చెరువు నుండి అనుమతి లేకుండా పెద్దపల్లి మండలానికి వచ్చిన మట్టి లారీలను రంగాపూర్ వద్ద గ్రామస్తులు అడ్డుకున్నారు. ఏ అనుమతితో మట్టి రవాణా చేస్తున్నారని లారీ డ్రైవర్లతో వాగ్వాదానికి దిగారు.

మతి నుండి తీసిన మట్టిని పెద్దపల్లికి ఎలా తెస్తారని నిలదీస్తారు. సమాచారం అందుకున్నఅధికారులు రంగాపూర్ శివారుకు వెళ్లి అనుమతి పత్రాలను పరిశీలించారు. పెద్దపల్లికి మట్టి తరలించే అనుమతి లేదని లారీలను రెవెన్యూ కార్యాలయానికి తీసుకువెళ్తూ మార్గమధ్యంలోనే తిరిగి లారీలను వదిలిపెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మట్టి అక్రమ రవాణా దారులతో అధికారులు లంచాలు మాట్లాడుకుని చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement