తిరుమలగిరి : మున్సిపాలిటీ పరిధిలోని అనంతరం సమీపంలో బి కేర్ వాగు ఉంది. నిత్యం ఇక్కడి నుంచి అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుక రవాణా జరుగుతుంది. సంబంధిత అధికారులకు పట్టింపు లేదు. ప్రజల సహజ సంపదను దోచుకుపోతున్నా ఉత్సవ విగ్రహాల్లా తిలకిస్తున్నారు. ఇటీవల కాలంలో బ్రిడ్జి పిల్లర్ల దగ్గర నుంచి ఇసుకను తోడేస్తున్నారు. దీంతో బ్రిడ్జి కూలే ప్రమాదముందని గ్రామస్తులు చెబుతున్నారు. బ్రిడ్జికి దూరంగా ఇసుకను అనుమతులతో తరలింపునకు వీలుంది. భవిష్యత్తులో బి కేర్ వాగును ఆనవాలు లేకుండా చేసే పనిలో ఇసుకాసురులు నిమగ్నమై ఉన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కళ్ళుండీ చూడలేని వైనం. జిల్లా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసి బ్రిడ్జికి ప్రమాదం జరగకుండా చూడాలని ప్రజలు కోటి దండాలు పెడుతున్నామని చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital