Monday, November 18, 2024

అక్రమ నర్సరీలు.. కుదేలవుతున్న‌ తాటి పరిశ్రమ

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో తాటి పరిశ్రమకు ముప్పుగా పరిణమించిన అక్రమ నర్సరీల తొలగింపు దిశగా అధికారులు దృష్టి సారించారు. ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తోన్న నర్సరీల నియంత్రణకు సంబంధించి త్వరలో ఓ విధానాన్ని రూపొందించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. తక్కువ కాలంలోనే అధిక రాబడులను పొందే క్రమంలో.. తెలుగు రాష్ట్రాల్లో పెద్దసంఖ్యలో అక్రమ నర్సరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇందుకు సంబంధించి పలు ఫిర్యాదులు వస్తుండడంతో అటవీ శాఖాధికారులు వాటి నియంత్రణ దిశగా చర్యలు ప్రారంభించారు. ప్రత్యేకించి పాత ఖమ్మం జిల్లాలోని దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో అక్రమ నర్సరీల సంఖ్య భారీగా ఉన్నట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు.

ఈ నర్సరీల కారణంగా ఆయిల్‌పాం పరిశ్రమకు ముప్పు వాటిల్లుతోందని అధికారులు భావిస్తున్నారు. అయితే, అటు హార్టికల్చర్‌ అధికారులకు కానీ, ఇటు ఆయిల్‌పాం రైతు సంఘాలకు కానీ… అక్రమ నర్సరీల విషయమై పెద్దగా సమాచారముండడంలేదు. కాగా… అక్రమ నర్సరీలకు సంబంధించి సమాచారమున్నప్పటికీ… వాటి విషయమై ఫిర్యాదులు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుండడం గమనార్హం. ఇదిలా ఉంటే… కేవలం ఖమ్మం జిల్లాలోని దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోనే దాదాపు 500 ఎకరాల మేరకు అక్రమ నర్సరీలు నడుస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.

అక్రమ నర్సరీల విషయమై దమ్మపేట మండలానికి చెందిన రైతు గుత్తా శ్రీనివాస్‌ రావు మాట్టాడుతూ ‘చట్టవిరుద్ధంగా వెలుస్తోన్న ఆయిల్‌పాం తోటలకు సంబంధించి రైతులు సహా అధికారులు కూడా అప్పమత్తంగా ఉండాల్సిన అవసరముంది’ అని పేర్కొన్నారు. కాగా… ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్‌, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ తదితర జిల్లాల్లో వేల ఎకరాల్లో అక్రమ నర్సరీలు నడుస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆయిల్‌పాం పరిశ్రమకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా డిెమాండద్‌ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే… రైతులకు ఈ ఏడాది 1.40 లక్షల ఆయిల్‌పాం మొక్కలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు యత్నిస్తున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి దమ్మపేట, అశ్వారావుపేట ఆంధ్రప్రదేశ్‌లోని పెదవేగి నర్సరీలనుంచి ఆయిల్‌పాం మొక్కల కొనుగోఁళ్లకు రైతులు పెద్దఎత్తున ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే… ప్రభుత్వమే స్వయంగా ఆయిల్‌పాం మొక్కలను అందించేందుకు చర్యలు ప్రారంభిసప్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా… అక్రమ నర్సరీలను అరికట్టే క్రమంలో… మొక్కకు రూ. 500 చొప్పున అందించి, ఆయిల్‌పాం మొక్కల పెంపకంవేపు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇండియాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌పాం రీసెర్చి శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘అక్రమ నర్సరీలను అరికట్టే క్రమంలో ప్రభుత్వ చర్యలకు తోడు తాము కూడా సహకారాన్నందిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కాగా… ఈ ఏడాది కేవలం ఒక్క ఖమ్మం జిల్లాలోనే 1.5 కోట్ల నుంచి రెండు కోట్ల వరకు ఆయిల్‌పాం మొక్కలకు డిమాండ్‌ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. వీటిని ఆయా నర్సరీలనుంచి రైతులకు అందించే దిశయా వ్యవసాయ,ఉద్యానవన శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపను కోస్టారికా, మలేషియా, ఇండోనేషియా తదితర దేశాల నుంచి ఆయిల్‌పాం మొక్కలను దిగుమతి చేసుకునేందుకు కూడా రాష్ట్రాధికారులు యత్నిస్తున్నారు. ఆయా దేశాల నుంచి ఇప్పటికే రెండు లక్షల వరకు ఆయిల్‌పాం మొక్కలను దిగుమతి చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని ప్రోత్సహకాలు… ఆయిల్‌పాం అక్రమ తోటల పెంపకాన్ని అరికట్టే క్రమంలో… నర్సరీల నుంచి ఆయిల్‌పాం మొక్కలను కొనుగోలు చేసి తోటలను పెంచేందుకు ముందుకొచ్చే రైతులకు మొక్కకు రూ. 500 వరకు ప్రోత్సహకాలను ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వినవస్తోంది. ఇదే జరిగితే… ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లోని రైతులకు తగిన చేయూతనందించినట్లవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement