Thursday, December 12, 2024

ADB | అక్రమ కలప పట్టివేత..

జన్నారం, డిసెంబర్ 11 (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందనపెల్లి రేంజులోని కవ్వాలకు చెందిన ముస్తాక్ ఇంట్లో రూ.35వేల అక్రమ టేకు ఫర్నిచర్ తో పాటు విద్యుత్ మోటారును, కోత రంపాలను అటవీ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.

ముందుగా అందిన సమాచారం మేరకు ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు కృష్ణారావు, హనుమంతరావు, రవి, ముజిబోద్దీన్, అమృత రావు, బేస్ క్యాంపు సిబ్బంది కవ్వాలకు వెళ్లి ముస్తాక్ ఇంట్లో సోదాలు చేయగా, ఆ ఫర్నీచర్, రంపం, విద్యుత్ మోటర్ లభించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రేంజర్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement