వాజేడు, జూన్ 13 (ప్రభ న్యూస్) : అక్రమ అరెస్టులను ఆపాలి అంటూ వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట సోషల్ మీడియా వేదికగా మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీన ములుగు జిల్లా వెంకటాపురం మండలం తడుపాల గ్రామం వద్ద 10గంటల సమయంలో గ్రేహౌండ్స్ పోలీసులు నిరాయుధులైన ముగ్గురు సభ్యులు రీత మోతి ఇడ్మల్ లతోపాటు తమ పనుల రీత్యా అడవికి వెళుతున్న ముగ్గురు వ్యక్తులను మార్గమధ్యలో పట్టుకుని వారిని ఎన్ కౌంటర్ పేరుతో చంపే ప్రయత్నం చేస్తున్నారు.
ఎలాంటి సంబంధం లేని అమాయకులను బాంబుల గురించి చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అరెస్టు చేసిన వారిని 24 గంటల్లో కోర్టులో హాజరు పరచాలి. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, బుద్ధి జీవులు పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను వ్యతిరేకించండి అంటూ లేఖలో పేర్కొన్నారు.