చౌటుప్పల్, సెప్టెంబర్ 10 (ప్రభ న్యూస్) : మహిళల్లో చైతన్య నింపిన వీరనారి చాకలి ఐలమ్మ అని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చౌటుప్పల్ లో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రజకుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఉచిత విద్యుత్తు, దోబీ ఘాట్ల నిర్మాణం, బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, కులవృత్తుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కోరారు.
సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాసరెడ్డి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ బాతరాజు సత్యం, రజక సంక్షేమ సంఘం నాయకులు కానుగు బాలరాజు, మల్లేశం, బాతరాజు యాదగిరి, సామకూర రాజయ్య, యాదయ్య, కేతరాజు అచ్చయ్య, మలిగే నరసింహ, రావుల స్వామి, కానుగు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బిజెపి నాయకులు, సిపిఎం నాయకులు చాకలి ఐలమ్మ వర్ధంతిని వేరువేరుగా నిర్వహించారు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.