Friday, November 22, 2024

ఐలమ్మ మహాయోధురాలు

బాన్సువాడ – తెలంగాణ సాయుద పోరాట యోదురాలు, స్వర్గీయ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు సమాజ సేవకు కంకణం కట్టాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ మహా యోదురాలు అని తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలకు తెగించి పోరాడిన దీర వనిత.ఆడబిడ్డ అయినా మగవారి కంటే ఎక్కువగా దైర్య సాహసాలు ప్రదర్శించారని సభాపతి కొనియాడారు.ఐలమ్మ స్పూర్తితో, వారు చూపించిన బాటలో తెలంగాణ బిడ్డలందరూ రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం కంకణ బద్దలు కావాలని పోచారం ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్టీవో భుజంగరావు, జిల్లా రైతుబంధు అద్యక్షులు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, సొసైటీ చైర్మన్ ఎవరు కృష్ణారెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు, రజక సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement