Thursday, November 21, 2024

ఇఫ్తార్ విందులు సోదరభావాన్ని పెంపొందిస్తాయి: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

రంజాన్ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందులు హిందూ, ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎంబి గార్డెన్స్ లో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అనంతరం మాట్లాడుతూ 30 రోజులపాటు ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్ష చేపడతారని, ఉపవాస దీక్ష ముగిసే సమయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసామన్నారు. రాబోయే రంజాన్ వినని ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో పాటు పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement