Friday, October 4, 2024

Mahesh Goud | కష్టపడి పని చేస్తే గుర్తింపు.. నా పయనమే నిదర్శనం

నిజామాబాద్ ప్రతినిధి (ప్రభ న్యూస్) : నాగన్న చెరువు నుండి ఢిల్లీ దాకా నా ప్రయాణం ఉంటుందని ఎవరైనా ఊహించారా అని.. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు తప్ప కుండా ఉంటుందని నా నియామకమే నిదర్శనమని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర రథసారధిగా నియమింపబడిన మహేష్ కుమార్ గౌడ్ తొలిసారిగా నిజామాబాద్ వస్తున్న సందర్భంగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దీపదాస్ మున్షీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగే శ్వరరావు, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుద ర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మాజీ ఎంపీ, విహెచ్పీ హనుమంతరావు, మధుయాష్కి గౌడ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

పిసిసి అధ్యక్షుడి గా నియమించడం నా అదృష్టం

ఒక సామాన్య కార్యకర్త నుంచి పిసిసి అధ్యక్షుడిగా నా అదృష్టమని రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశీర్వాదం తోడై ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. మొదటి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి అధిష్టానం ఈ బాధ్యతలు అప్పజెప్పినందుకు ప్రత్యేకంగా అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పచెప్పినందుకు పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.

రాజకీయాల్లోకి నన్ను బలవంతంగా తీసుకువచ్చిన వ్యక్తి డి. శ్రీనివాస్ అని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నక్సల్ ప్రభావితమైన గ్రామం రహత్నగర్ నుండి రావడం జరిగిందన్నారు. నా కుటుంబం రాజకీయ కుటుంబం కాదు, వ్యవసాయ కుటుంబమని చెప్పారు. ఎన్ఎస్యుఐ నుంచి పీసీసీ అధ్యక్షుడుగా పదవి రావడ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -

గతంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అప్పట్లో మండలపై పోటీ చేశానని తెలిపారు. పోటీ చేసి ఓడినాకూడా కాంగ్రెస్ పార్టీ ని 35 సంవత్సరాలుగా పట్టుకొని ఉన్నాననీ చెప్పారు. ఎందరో రాష్ట్ర సీనియర్ నాయకులు నాకు అండగా ఉన్నారన్నారు. ఎన్నో కష్టాలు చూసాను 35 సంవత్సరాలు ఎన్ని కష్టాలు ఎన్ని పరాభాలు ఎదురైన పార్టీని పట్టు కొని ఉన్నానని తెలిపారు. ఇన్ని సంవత్సరాల పోరాటానికి వడ్డీతో సహా ఫలితం దక్కిందనీ నా జన్మ ధన్యం అయింది. పార్టీ కోసం పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా గుర్తింపు ఉంటుందనడానికి నానియామకమే నిదర్శనమని తెలిపారు.

నిజామాబాద్ పంటలు పండే సస్యశ్యామలమైన జిల్లా ఇది. కాని ఇప్పుడు వెనుకబడిన జిల్లాగా మారిందన్నారు. అనుభవమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.. నాయకత్వం పుష్కలంగా ఉందన్నారు. జిల్లాపై దృష్టి పెట్టాలనీ రాష్ట్రనాయకులను కోరారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల కోసం కష్టపడతాం పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు. మా బాధ్యత మీ అందరి కార్యకర్తలుల్లో జీవితాలలో వెలుగు నింపుతామన్నారు.

కేంద్రంలో ఖర్గే 50 సంవత్సరం సుదీర్ఘ రాజకీయ అనుభవం కలవాడన్నారు. బీసీ అయిన నాకు ఎటువంటి రాజకీయ అండ లేకున్నా పీసీసీ అధ్యక్షత బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు పారిశ్రా మికంగా పెట్టింది పేరు, ఆసియా ఖండంలోనే షుగర్ ఫ్యాక్టరీ పెద్దది. ప్రస్తుతం నిజామాబాద్ పెరు లేకుండా పోయిందన్నారు. విద్య పరంగా ఒకే మెడికల్ కళాశాల ఉంది, ఇంకోటి రావాలి, ఇంజనీరింగ్ కళాశాల రావాలన్నారు.

దేవుడు పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్న బిజెపి..

మోడీ 2014 లో ఏమి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడు గుర్తు చేసుకోవాలని అన్నారు. మోడీ మతం, కులం పేరిట రాజకీయం చేస్తున్నారనీ మండిపడ్డారు. దేవుడు పేరిట రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. శ్రీ రాముడుకి బీజేపీకి ఏమి సంబంధం అని ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్ కై ప్రజలు ఆలోచించాలనీ కోరారు. మేము కూడా శ్రీ రామచంద్ర భక్తులమే అని చెప్పారు.

అప్పుల తెలంగాణ గా మార్చిన ఘనత బిఆర్ఎస్ ది

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పేరిట అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత బిఆర్ఎస్ కే దక్కుతుందని మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోట్లల్లో అప్పు చేశారని ఆరోపించారు. వాటికి ప్రస్తుతం కోట్లలో వడ్డీ చెల్లించడం జరుగుతుందన్నారు. స్పోర్ట్స్ అథారిటీలో వేల కోట్లు బాకి పెట్టాడనీ వాపోయారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ లో ఖుర్చోని అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా నిర్వహించడం లేదన్నారు. ఫామ్‌హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాడని మండిపడ్డారు. మొన్న వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారి వద్దకు వెళ్ళలేదన్నారు.

పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు

కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టు కొమ్మలనీ కాంగ్రెస్ పార్టీకి మీరే బలం అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా పరిపూర్ణాంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందే విధంగా నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తాననీ మహేష్ కుమార్ తెలిపారు. ప్రతి కార్యకర్తలకు పదవులు తప్పకుండా వస్తాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమమని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement