Friday, November 22, 2024

ఈ క‌రెంట్ బిల్ చూస్తే.. షాక‌వ్వాల్సిందే…

ఓ ఇంటికి క‌రెంట్ బిల్లు నెల‌కు ఐదు వంద‌లో.. లేదంటే వెయ్యి రూపాయ‌ల్లోపో వ‌స్తుంటుంది.. కానీ ఇక్క‌డ ఓ ఇంటికి వ‌చ్చిన క‌రెంట్ బిల్లు చూస్తే ఖ‌చ్చితంగా షాక‌వుతారు. ప్రతీ నెలా రూ.500 కూడా దాటని క‌రెంట్ బిల్లు ఉన్నట్టుండి ఆ ఇంటి నెలవారి కరెంట్‌ బిల్లు లక్ష దాటేస్తే.. ఆ ఇంటి యజమానికి షాక్‌ తగిలినంత పనైంది. సాంకేతిక లోపమో.. రీడింగ్‌ నమోదు చేయడంలో పొరపాటుతోనో కానీ.. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తేనే ఉంటాయి. అయితే తాజాగా.. ప్రతీనెలా రూ. 400 దాటని ఇంటికి కరెంటు బిల్లు రూ.1.21 లక్షలు రావడంతో ఆ ఇంటి యజమాని నివ్వెరపోయారు. తెలంగాణ రాష్ట్రంలోని చేర్యాలలోని అభయాంజనేయస్వామి ఆలయ వీధిలో ఏకంగా ఓ ఇంటి నెల వారి కరెంట్‌ బిల్లు 1.21 లక్షలు దాటేసింది.. శుక్రవారం కరెంటు మీటరు రీడింగ్‌ తీశారు విద్యుత్‌ శాఖ సిబ్బంది.. 12,868 యూనిట్లు వినియోగించినట్టు రీడింగ్‌ సూచించింది. ఇక బిల్లు ఏకంగా రూ.1,21,668గా వచ్చింది. ప్రతీనెల రూ. 400 లోపు బిల్లు వస్తుందని, ఈ నెల ఏకంగా లక్షకుపైగా బిల్లు రావడంతో వినియోగదారుడు షాక్‌ తిన్నాడు.. ఈ విషయాన్ని విద్యుత్‌ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రీడింగ్‌లో ఎక్కువగా నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement