Friday, November 22, 2024

NZB: రోడ్డుపై కూరగాయలు విక్రయిస్తే చర్యలు తప్పవు..

కూరగాయల మార్కెట్ ను తనిఖీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్
నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్17 (ఆంధ్రప్రభ) : కూరగాయల మార్కెట్లో దుకాణదారులు తమకు కేటాయించిన దుకాణ సముదాయాల్లో మాత్రమే కూరగాయలు విక్రయించాలని, రోడ్డుపై విక్రయిస్తే చర్యలు తప్పవని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి సూచించారు. గురువారం ఉదయం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజిలో గల కూరగాయల మార్కెట్ ని మార్కెట్ కమిటీ చైర్మన్ తనిఖీలు చేపట్టారు. మార్కె ట్ లో ఉన్న షాప్ యజమానులకు ఇచ్చిన షాప్ స్థలం ఉన్నంత వరకే కూరగాయల విక్రయాలు నిర్వహించాలని షాప్ ముందు ఉన్న రోడ్ పై కూరగాయల విక్రయాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిం చారు. మార్కెట్ ను పరిశీలించారు.

రోడ్డుపై వాహనాలు నిలపరాదు..
రోడ్డుపై వాహనాలు నిలపరాదని సూచించారు. మార్కెట్ లో ఎక్కడపడితే అక్కడ రోడ్డుపై వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముప్పాగంగారెడ్డి తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని యూనియన్ అధ్యక్షులకు సూచించారు. చైర్మన్ గంగారెడ్డితో సెక్రటరీ, ఏఎంసీ డైరెక్టర్లు మల్లేష్, డైరెక్టర్లు మల్లేష్, మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement