Friday, November 22, 2024

TS | వాళ్లంతా ఎన్నిక‌ల హ‌డావుడిలో ఉంటే.. కేసీఆర్ డెవ‌ల‌ప్‌మెంట్ గురించి ఆలోచిస్తున్నారు: కేటీఆర్‌

రాజకీయ ప్రత్యర్థులు ఎన్నికల ప్రణాళికలు వేస్తూ బీజీ బిజీగా ఉంటే.. బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్‌ మాత్రం రాబోయే తరానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిమగ్నమయ్యారు అని మంత్రి కేటీఆర్ అన్నారు. ట్విట్టర్​ వేదికగా ఆయన ఈ విషయాన్ని షేర్​ చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం వైద్యం, వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోందన్నారు.

ఇకపై తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ, 500 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇది ఒక అసమానమైన ఘనతగా మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. వైద్య మౌలిక సదుపాయాల విషయంలో తెలంగాణకు సమీపంలోనైనా కానీ, దగ్గరగా కానీ ఏదైన రాష్ట్రం ఉందా అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement