Friday, November 22, 2024

TS | స‌మ‌స్య‌లుంటే ప‌రిష్క‌రిద్దాం.. ఆత్మ‌హ‌త్య‌లు వ‌ద్ద‌న్న గ‌వ‌ర్న‌ర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: నిర్మల్‌ జిల్లా బాసర దివ్యక్షేత్రంలో ఉన్న ట్రిపుల్‌ ఐటీలో జరుగుతున్న వరుస ఆత్మహత్యలపై గవర్నర్‌ తమిళిసై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంపై జోక్యం చేసుకోవాలని ఆమె ట్రిపుల్‌ ఐటీ ఉపకులపతి (వీసీ) వెదుళ్ల వెంకట రమణను కోరారు. ఆత్మహత్యల నివారణకు ట్రిపుల్‌ ఐటీ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై 48 గంటల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఆత్మహత్యల్లాంటి తీవ్ర చర్యలకు పాల్పడొద్దని, సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌ విద్యార్థులకు సూచించారు. కాగా, బాసర ట్రిపుల్‌ ఐటీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. రెండు, మూడు రోజుల్లోనే బాసర ట్రిపుల్‌ ఐటీక్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థినులు చ‌నిపోవ‌డం చర్చనీయాంశంగా మారింది. విపక్షాలు కూడా యూనివర్శిటీ పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement