Friday, November 22, 2024

మాస్క్ లేకపోతే రూ.వెయ్యి ఫైన్‌.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలే

కరోన మహమ్మారి మరోసారి విజృంభిస్తోంద‌ని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద మాస్కు వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ మాస్క్ రక్షణ కవచం లాంటిదని, తప్పనిసరిగా వినియోగించాలన్నారు. ఇకపై తరచూ తనిఖీలు నిర్వహిస్తామని మాస్కు ధరించకపోతే వెయ్యి రూపాయలు జరిమానా ఇస్తామన్నారు.

తరచూ శానిటైజర్ వినియోగించి చేతులు శుభ్రం చేసుకోవాల‌ని, రద్దీ ప్రదేశాల్లో భౌతిక దూరం కచ్చితంగా పాటించాలన్నారు ఏసీపీ సారంగ‌పాణి. క‌రోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. అవ‌గాహ‌న కార్యక్రమంలో సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్, ఎస్ఐ లు రాజేష్, రాజ వర్ధన్, సహదేవ్ సింగ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement