Thursday, November 14, 2024

TS | పల్లాను గెలిపిస్తే నెల రోజులలో చేర్యాల డివిజన్: సీఎం కేసీఆర్

ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో, (ప్ర‌భ న్యూస్‌): ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి మ‌స్త్ హుషారుగున్న‌డు. ముత్తిరెడ్డి అనుకుంటే ఆయ‌న‌కంటే చాలా హుషారైండు.. ఈయ‌న‌కంటే ముత్తిరెడ్డి బెట‌రుండే.. అయినా ఇట్లాంటి ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకున్న లీడ‌ర్లు ఉండాలి. ఎన్నిక‌ల్లో పోటీ ప‌డ‌డానికి ముందే స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని ప‌రిష్కారానికి కృషి చేయ‌డం మంచిదే. ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి చెప్పిన‌ట్టు చేర్యాల డివిజ‌న్ కావాల‌ని చాలామంది నుంచి విన‌తి అందింది. ఈ ఎన్నిక‌ల్లో ప‌ల్లాని గెలిపిస్తే ఆ త‌ర్వాత నెల రోజుల్లోనే చేర్యాల డివిజ‌న్‌గా చేస్తాం అని సీఎం కేసీఆర్ అన్నారు.

జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఉత్సాహంగా ప్ర‌సంగించారు. సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి, తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జనగాం ప్రాంతం ఒకప్పుడు రాష్ట్రంలోనే అత్యధిక కరువు పీడిత ప్రాంతమని నేడు అదే జనగామ ఈ రోజు కరువు కాటకాలు తొలిగి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక ధాన్యం పండిచే తాలుకాగ మారి కరువును జయించిందనీ సీఎం అన్నారు.

పల్లా ను భారీ మెజార్టీతో గెలిపిస్తే.. నెల రోజులలో చేర్యాల డివిజన్ చేస్తా: సీఎం కెసిఆర్
పల్లారాజేశ్వేర్ రెడ్డినీ జనగాం ఎమ్మెల్యే గా భారీ మెజారిటీ తో గెలిపిస్తే ఒక్క నెల రోజుల్లోనే చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా చేస్తానని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రకటించారు.జై చేర్యాల నినాదాలతో ఒక్కసారిగా సభ దద్దరిల్లింది. చేర్యాల, మద్దూరు, నర్మెట్ట జూనియర్ కాలేజ్ లకు పక్క భవనాలు మంజూరు చేస్తామని అన్నారు.

మల్లన్న సాగర్ నుండి జనగామ ప్రాంతానికి సాగు నీరు అందిస్తాం: సీఎం కెసిఆర్
జనగామ నియోజకవర్గం తలాపున 50 టీఎంసీ ల సామర్థ్యం కలిగిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఉంది.అక్కడి నుండి జనగామ నియోజకవర్గంలోని తపాస్ పల్లీ రిజర్వాయర్ ద్వారా సాగు నీరు అందించి జనగామ,చేర్యాల ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.రాష్ట్రంలో ఎక్కడ కరువు వచ్చిన జనగామ లో మాత్రం కరువు రాదని అన్నారు.

- Advertisement -

జనగామ‌ కు ఇండస్ట్రీలు, ఐటీ కారిడార్ లు వస్తాయి: సీఎం
జనగాం రాష్ట్ర రాజదాని హైదరాబాద్ కి అత్యంత దగ్గరి ప్రాంతమని హైదరాబాద్ దాటితే 60 కిలో మీటర్లు ఉంటుందని ఇక్కడికి ఐటీ కారిడార్,ఇండస్ట్రీ లు వస్తాయని అన్నారు.ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం అన్నారు.

ఆలోచించి ఓటు వేయండి: సీఎం కెసిఆర్
ఎన్నికల సమయంలో అనేక మంది మీ దగ్గరికి వచ్చి ఓటు అడుగుతారని ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయాలని,ఓటు వేసిన తరువాత ఆలోచిస్తే ఏమి కాదని మళ్ళీ పనుల కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తాదని అందుకే ఆలోచించి ఓటు వేయాలని సీఎం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement