Friday, November 22, 2024

TS: అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తే.. సీఎం అయినా వ‌దిలిపెట్టం.. కేటీఆర్

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నెత్తి లేని ఓ మంత్రి తాను హీరోయిన్‌లను బెదిరించిన అని మాట్లాడుతున్నారు.. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేయాల్సిన ఖర్మ నాకేంటన్నారు. మరీ ఇంత దిగజారాల్సిన అవసరం తనకు లేదన్నారు. లీకు వీరుడు రేవంత్ రెడ్డి ఆధారాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇలానే అసత్య ఆరోణలు చేస్తే సీఎం అయినా సరే ఎవరినీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.

రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టడం కాదు, వాటర్ ట్యాప్‌పై దృష్టి పెట్టండని ఎద్దేవా చేశారు. కాగా, గత బీఆర్ఎస్ హయాంలో పలువురు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడంతో పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వెనక అప్పటి మంత్రి కేటీఆర్ హస్తం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ టాలీవుడ్ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయించాడని మంత్రులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement