Monday, November 25, 2024

దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్.. తయారీదారుగా తెలంగాణ ఘనత

మరో ఘనతని నమోదు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..ఇప్పటికే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని జహీరాబాద్ లో హాట్సన్ నూతనంగా ఏర్పాటు చేసిన చాకొలెట్, ఐస్ క్రీమ్ ఉత్పత్తి ప్లాంట్ గురువారం తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ విషయాన్ని తెలుపుతూ తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్… రాష్ట్రం నూతన రికార్డును నమోదు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.రూ.400 కోట్ల పెట్టుబడితో హాట్సన్ జహీరాబాద్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ లో ఆ సంస్థ రోజుకు 7 టన్నుల చాకొలెట్లతో పాటు 100 టన్నుల ఐస్ క్రీమ్ ను ఉత్పత్తి చేయనుంది. తద్వారా ఐస్ క్రీమ్ తయారీలో తెలంగాణను ఆ సంస్థ దేశంలోనే అతిపెద్ద తయారీదారుగా నిలిపింది. అరుణ్ ఐస్ క్రీమ్, ఐబాకో పేరిట హాట్సన్ ఐస్ క్రీమ్ లను ఉత్పత్తి చేస్తోంది. ఈ యూనిట్ కోసం హాట్సన్ కంపెనీ రాష్ట్రంలోని 5 వేల మంది పాల ఉత్పత్తిదారుల నుంచి రోజుకు 10 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోందని కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement