అబ్దుల్లాపూర్ మెట్,17 ఆగస్టు (ప్రభన్యూస్) ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చెందిందని మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 కోట్ల 25 లక్షల నిధులతో నిర్మించిన తాసిల్దార్ కార్యాలయం, మండల పరిధి లష్కర్ గూడ గ్రామంలో 6 కోట్ల 40 లక్షల నిధులతో చేపట్టనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, రామోజీ ఫౌండేషన్ తరపున ఎండి కిరణ్, విజయేశ్వరి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి లతో కలిసి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ…. రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో పోలీస్ స్టేషన్, ప్రస్తుతం తాసిల్దార్ కార్యాలయం, ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయాలు నిర్మించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 100 పడకలుగా నిర్మించాలని మంత్రులను కోరగా మంత్రి హరీష్ రావు భవిష్యత్తులో తప్పకుండా డయాలసిస్, ఐసీయూ సెంటర్లు అందుబాటులో ఉండే విధంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
విద్య, వైద్య రంగాలలో రాష్ట్రం నెంబర్ వన్ స్థాయికి చేరుకుందని, ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రశేఖర్ రావును మూడోసారి ముఖ్యమంత్రి చేస్తామని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపాడు. పది రాష్ట్రాలకు అన్నం పెట్టే విధంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి అభివృద్ధి చేశాడని అన్నాడు. దేశానికి అవసరమయ్యే డాక్టర్లను ఉత్పత్తి పరిశే విధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా తయారవుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్, జెడ్పిటిసి బింగి దాస్ గౌడ్, సొసైటీ బ్యాంకు చైర్మన్ లెక్కల విఠల్ రెడ్డి, స్థానిక సర్పంచ్ చెరుకు కిరణ్ కుమార్ గౌడ్, లష్కర్ గూడ ఎంపీటీసీ సీక సాయికుమార్ గౌడ్, సర్పంచ్ ఏసూరు పారిజాత శేఖర్, ఉప సర్పంచ్ అల్లి యాదయ్య యాదవ్, వార్డు సభ్యులు, నాయకులు కొత్త కిషన్ గౌడ్, కోట లక్ష్మారెడ్డి, కోట వెంకట్ రెడ్డి, పూజారి చక్రవర్తి గౌడ్, బబ్బురు దేవేందర్ గౌడ్, మొగుళ్ళ జీవన్ కుమార్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నల్లోల్ల పాండు, బాలయ్య యాదవ్, గుండె నరసింహ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు