తెలంగాణలోని పది ప్రభుత్వ యూనివర్సిటీల వీసీల పదవీకాలం ఇవాళ్టితో(మంగళవారం) ముగిసింది. కొత్త వీసీల నియామకానికి సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఓయూ, కాకతీయ, జేఎన్‌టీయూ, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, జవహర్ లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీల ఇన్ ఛార్జీ వైస్ ఛాన్సలర్స్ లను నియమిస్తూ ప్రభుత్వం నేడు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు..
ఇంచార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు
ఉస్మానియా యూనివర్సిటీ : దాన కిషోర్
జేఎన్టీయూ కి : బుర్ర వెంకటేశం
కాకతీయ యూనివర్సిటీ : కరుణ వాకాటి
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ : రిజ్వి
తెలంగాణ వర్సిటీ : సందీప్ సుల్తానియా
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ : శైలజ రామయ్యర్
మహాత్మా గాంధీ యూనివర్సిటీ : నవీన్ మిట్టల్
శాతవాహన యూనివర్సిటీ : సురేంద్ర మోహన్
పాలమూరు యూనివర్సిటీ : నదీం అహ్మద్
జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ : జయేష్ రంజన్