Friday, November 22, 2024

TS | టికెట్‌ వచ్చినా, రాకున్నా పార్టీలోనే ఉంటా.. ప్రమాణపత్రంపై సంతకం చేయాల్సిందే!​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కోసం తెలంగాణ కాంగ్రెస్‌ దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం నుంచి ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఇప్పటికే దరఖాస్తు విధి విధానాలను సబ్‌ కమిటీ ఖరార్‌ చేసింది. దరఖాస్తుల స్వీకరణ రుసుము విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు దరఖాస్తు చేసుకోవడానికి రూ. 25 వేలు, ఓసీలకు రూ. 50 వేల చొప్పున దరఖాస్తు రుసుము ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆశావాహుల కోసం నాలుగు పేజీల దరఖాస్తును గాంధీభవన్‌లో అందుబాటులో ఉంచారు. వ్యక్తిగ వివరాలతో పాటు, ప్రస్తతం పార్టీలో హోదా, గతంలో పార్టీ కోసం చేసిన సేవ, ఇప్పటీ వరకు పొందిన పదవులు, గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, సామాజిక మీడియా యాక్టీవిటి, క్రిమినల్‌ కేసులు, కోర్టు శిక్షలతో పాటు పోటి చేయదల్చిన నియోజక వర్గం తదితర అంశాలను దరఖాస్తులో పొందుపర్చాల్సి ఉంటుంది. అదే విధంగా ఓడినా.. గెలిచినా పార్టీ ఉంటానంటూ అభ్యర్థుల నుంచి ప్రమాణ పత్రం కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టికెట్‌ రాని వారు కూడా పార్టీ విజయం కోసం పని చేస్తామని ప్రమాణ పత్రంలో పొందుపర్చాల్సి ఉంటుందని చెబుతున్నారు.

సీడబ్ల్యూసీ అనుమతితోనే ఫైనల్‌ నిర్ణయం..

ఆర్జీలను తీసుకోవడానికి గాంధీభవన్‌లో ప్రత్యేక కౌంటరన్లు ఏర్పాటు చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ముగిసిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ స్క్రూటీని చేస్తుంది. దరఖాస్తుల పరిశీల తర్వాత అభ్యర్థులైన జాబితాను రూపొందించి స్క్రీనింగ్‌ మిటీ చైరమన్‌ మురళీధరన్‌ కమిటీకి నివేదిస్తారు. ఈ జాబితాను స్క్రీనింగ్‌ కమిటీ క్లుణ్ణంగా పరిశీలించి అవసరమైతే అభ్యర్థులతో నేరుగా మాట్లాడుతారు. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు, అభ్యర్థి పోటీ చేసే నియోజక వర్గాల్లో ప్రత్యర్థుల బలాలు, బలహీనతలు బేరీజు వేయనున్నారు. ఆ తర్వాత దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజక వర్గాల నుంచి మూడు పేర్లను సెంట్రల్‌ ఎన్నికల కమిటీకి సిఫారసు చేయనున్నారు. సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ ముందుకు వచ్చిన స్క్రీనింగ్‌ కమిటీ నివేదికను మరోసారి పరిశీలించి చివరకు సీడబ్ల్యూసీ ఆమోదంతో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.

- Advertisement -

ఏకాభిప్రాయం కుదరకపోతే చివరి జాబితాలోనే..

అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతేనే ఈ నాలుగంచెల విధానాన్ని అనుసరిస్తారు. అలాంటి నియోజక వర్గ అభ్యర్థుల జాబితా ప్రకటన చివరి జాబితాలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు పర్యవేక్షిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అగ్రనేతల పర్యవేక్షణలోనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నందున ఎలాంటి వివాదాలు, లొసుగులకు తావుండదని, పాదర్శకతనే ప్రామాణికమని చెబుతున్నారు. టికెట్ల కోసం గ్రూపులు నడిపేవారి మాటలు చెల్లకపోవచ్చని అంచనా వేస్తున్నారు. టికెట్ల కోసం పోటీ అధికంగా ఉండటం వల్ల సామాజిక న్యాయం పాటించాల్సి ఉండటం కూడా పార్టీకి తలనొప్పిగా మారుతుందని పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు.

టికెట్‌ కోసం దరఖాస్తు చేయడం నేనెప్పుడు చూడలేదు: నాగం జనార్దన్‌రెడ్డి

ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకునే సంప్రదాయం తానెప్పుడు చూడలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. సీనియార్టీని, ప్రజల్లో పలుకుబడితో పాటు ఎవరు గెలుస్తారో గుర్తించి అధిష్టానం గుర్తించి టికెట్‌ ఇస్తారని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడం వల్ల ఎతో జరుగుతుందని ప్రచారం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఆయన అంత పెద్దోడు ఎప్పుడు అయ్యారని. జిల్లాలో తానే సీనియర్‌ నాయకుడినని అన్నారు. కొల్లాపూర్‌, నాగర్‌ కర్నూల్‌ నియోజక వర్గాలకు చెందిన రెండు టికెట్లు కావాలని అడుగుతున్నారని ప్రచారం జరుగుతోందని, కొల్లాపూర్‌లో పార్టీ కోసం మొదటి నుంచి పని చేస్తున్న జగదీశ్వర్‌రావు పరిస్థితి ఏమి కావాలని నాగం నిలదీశారు. నాగర్‌ కర్నూల్‌ నుంచి తాను బరిలో ఉంటానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిని తానే గెలిపించానని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement