Tuesday, November 26, 2024

నా దగ్గర సర్జికల్ బ్లేడ్ ఉంది.. చేయి కోసుకుంటా: కొండా సురేఖ బెదిరింపులు

ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ హల్ చల్ చేశారు. వరంగల్ వెళ్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆమె మండిపడ్డారు. ఏ కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తార‌ని ఫైర్ అయ్యారు. వెంటనే రేవంత్ రెడ్డిని వదిలిపెట్టాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వరంగల్ నుంచి నేరుగా ఘట్‌కేసర్ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన కొండా సురేఖ స్టేషన్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించారు.

కాగా, దీనికి పోలీసులు అంగీకరించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ సురేఖ‌. గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లారు. డోర్ తీయాలని కోరినా పోలీసులు తీయకపోవడంతో తన దగ్గర సర్జికల్ బ్లేడ్ ఉందని, చెయ్యి కోసుకుంటా అని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు.. ఎటువంటి కారణం లేకుండా ఎలా అరెస్టు చేస్తారని పోలీసులపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాగా, ఈ ఘటనను వీడియో తీస్తున్న వ్యక్తి నుంచి పోలీసులు ఫోన్ లాక్కున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రేవంత్ రెడ్డిని పోలీసులు విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement